ఈరోజు కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే గారి నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన మహిళా సోదరీమణులు, నాయకురాల్లు ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ గారిని కలిసి "రాఖీలను" కడుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలలో ప్రతీ పండుగలలో ఒక పరమార్థం దాగివుందని,సోదరభావాన్ని పెంచే ఈ రాఖీ పర్వదిన వేళ మహిళా సోదరులందరిఖీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. నేడు రాజకీయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నేను హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడంలో మహిళా సోదరీమణుల కృషి ఎంతగానో ఉందని ఈ సంధర్బంగా వారికి మరోమారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa