ప్రస్తుతం అమెరికాలో మీజిల్స్ కేసులు పెరుగుతున్నాయి. హాలిడే సీజన్ లో భాగంగా 8.03 మిలియన్ల మంది ప్రయాణాలు చేస్తున్నారని అంచనా. న్యావార్క్ లిబర్టీ, బోస్టన్ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రయాణికులు ఈ వ్యాధి బారిన పడ్డారు. గాలి ద్వారా వ్యాపించే ఈ వైరస్ సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు గాలిలో వచ్చే బిందువుల ద్వారా సులభంగా వ్యాపిస్తుంది. USలో ఇప్పటి వరకు 2,012 మీజిల్స్ కేసులు నమోదయ్యాయి. ప్రయాణాలు చేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వీలయితే మీజిల్స్ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆరోగ్య శాఖలు హెచ్చరిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa