వికారాబాద్ జిల్లా పూడూరు మండల బిజెపి అధ్యక్షుడు రాఘవేందర్ పై హత్యాయత్నం ఘటనలో ఇద్దరు పోలీసు సిబ్బంది పై ఉన్నతాధికారులు వేటు వేశారు. ఈనెల 16 న రాఘవేందర్ పై హత్యాయత్నం జరిగిన సమయంలో కారులో హెడ్ కానిస్టేబుల్, హోంగార్డు ఉన్నారని బిజెపి నాయకులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.దీనికి సంభందించిన సిసి ఫుటేజ్ లు కూడా సమర్పించారు.
ఈ నేపథ్యంలో విచారణ జరిపిన అధికారులు ప్రైవేటు వాహనంలో హెడ్ కానిస్టేబుల్ పెంటయ్య,హోంగార్డు ఆంజనేయులు ఉన్నట్టు తేలడంతో వారిపై వేటు వేశారు. ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేస్తు ఆదేశాలిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa