ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శాంతి భద్రతలను కాపాడలేకపోతున్నారు.. సీఎం రేవంత్ పై కేటీఆర్ ఫైర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 14, 2024, 02:10 PM

సీఎం రేవంత్ రెడ్డి శాంతిభద్రతలను కాపాడలేకపోతున్నారని కేటీఆర్ విమర్శించారు. పోలీసుల సహకారంతో గుండాలను పంపి ఎమ్మెల్యే కౌశిక్ ఇంటిపై దాడి చేయించారని ఆరోపించారు.
ఈ దాడికి సహకరించిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మొన్నటి వరకు పార్టీ మారానని చెప్పిన అరికెపూడి గాంధీ, ఫిరాయింపులపై కోర్టు తీర్పు రాగానే బీఆర్ఎస్ లోనే ఉన్నానంటూ మాట మార్చారని ఎద్దేవా చేశారు. ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని ప్రశ్నించినందుకు దాడి చేస్తారా? అని మండిపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa