ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాలుగున్నర దశాబ్దాల కలయిక

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 23, 2024, 03:45 PM

మెట్ పల్లి పట్టణంలోని విఆర్ఎం గార్డెన్లో 1978-1979 పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం సంబరంగా నిర్వహించుకున్నారు. 45 సంవత్సరాల తర్వాత పదవ తరగతి స్నేహితులంత ఆత్మీయ సమ్మేళనం లో కుటుంబ సభ్యులతో ఆనందంగా ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులంతా మాట్లాడుతూ ఉద్యోగాలు,  వ్యాపారాలు తాలుక ముచ్చట్లను పంచుకొన్నారు.
నాలుగున్నర దశాబ్దాల తరువాత కలవడం తో ఉల్లాసంగా గడిపారు. అదేవిధంగా విద్య నేర్పిన ఉపాధ్యాయులు  గండ్ర ఆనందరావు, ఎన్ శంకరయ్య నరసింహారెడ్డి లను ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కోట గంగాధర్ ,మగ్గిడి వెంకట నరసయ్య, ప్రోహార్ హేమచందర్, దురిశెట్టి మనోహర్, ఎండి రజియోద్దీన్, బచ్చు వెంకటరమణ, వై మనోహర్, భూపాల్, వంగరి మధుసూదన్, గోపి ,ఉమామహేశ్వర్ , బేతు గౌతం తదితర పూర్వ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa