వనపర్తి జిల్లా ఆత్మకూరు-కొత్తకోట పట్టణాల మధ్య బుధవారం రాకపోకలు నిలిచిపోయాయి. మదనాపురం మండలంలో సరళసాగర్ ప్రాజెక్టు 4 వుడ్ సైఫాన్లు, 2 ప్రైమరీ సైఫాన్లు తెరుచుకోవడంతో భారీగా వరద నీరు దిగువ ఉన్న రామన్ పాడు ప్రాజెక్టుకు చేరుతోంది. మదనాపురం సమీపంలోనిలో ఊకశెట్టి వాగు లెవెల్ కాజ్ వేపై నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆత్మకూరు-కొత్తకోట పట్టణాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa