మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడలో థార్ కారు బీభత్సం సృష్టించింది. కారు వేగంగా వెళ్లి పార్క్ చేసి ఉన్న రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. ఈ వాహనంలో ఉన్న నలుగురు యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా ఈ ప్రమాదానికి కారణమైన నలుగురిని స్థానికులు చితకబాదారు. అనంతరం కారు అద్దాలను ధ్వంసం చేశారు. వారిలో ఒకరు హైకోర్టు న్యాయవాది అంటూ దబాయించాడని సమాచారం. పోలీసులతోనూ వారు వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa