వికారాబాద్ మునిసిపల్ సమావేశంలో దసరా ఉత్సవాల ఎజెండాను ఏకగ్రీవంగా ఆమోదించిన కౌన్సిల్ సభ్యులు. రాబోయే దసరా పండుగను పురస్కరించుకొని ఈరోజు వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ గారి ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశం ప్రారంభంలో వికారాబాద్ పట్టణ అభివృద్ధికి విశేష సేవలు అందించి, వికారాబాద్ పట్టణ ప్రజలందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచి ఇటీవల స్వర్గస్తులైన చీకటి మర్ల విశ్వనాథం గారి ఆత్మకు శాంతి చేకూరాలని కౌన్సిల్ సభ్యులు 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డులలో దసరా ఉత్సవాల ఏర్పాట్లు, అక్కడ చేపట్టే పనులకు సంబంధించిన ఎజెండాను చైర్ పర్సన్ కౌన్సిల్ సమావేశంలో ప్రవేశ పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఆలంపల్లిలో రావణ దహనం ఇతర ఏర్పాట్లు గంగారం, కొత్తగడి, అనంతగిరిపల్లి, మద్గుల్ చిట్టెంపల్లి, గుడిపల్లి, దన్నారం, వెంకటాపూర్ తాండ, ఎన్నేపల్లి, రాజీవ్ గృహకల్ప, శివరాం నగర్ మొదలైన కాలనీలలో దసరా ఉత్సవాల ఏర్పాట్లకు కావాల్సిన నిధుల ఎజెండాను మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు అందరూ ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగిందని చైర్ పర్సన్ వెల్లడించారు. కౌన్సిల్ సమావేశం ప్రశాంతంగా జరగడానికి సహకరించి, ఎజెండాను ఏకగ్రీవంగా ఆమోదించిన కౌన్సిల్ సభ్యులకు చైర్ పర్సన్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో కమిషనర్ జాకీర్ అహ్మద్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
అనంతరం వికారాబాద్ మున్సిపల్ లో డిఈ గా విధులు నిర్వహించి బదిలీపై వెళ్లిన డిఈ ప్రశాంత్ గారిని శాలువా, పూలమాలతో సన్మానించిన చైర్ పర్సన్ గారు.. అభినందన వీడ్కోలు తెలిపారు. అలాగే కొత్తగా వచ్చిన డిఈ రాకేష్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ జాకీర్ అహ్మద్, వికారాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, కౌన్సిలర్లు సురేష్, రామస్వామి, కిరణ్ పటేల్, జైదుపల్లి మురళి, కొండేటి కృష్ణ, వేణుగోపాల్ రెడ్డి, రాములు, మహిళా కౌన్సిలర్లు శ్రీదేవి, మొముల స్వాతి, సునీత గౌడ్, ప్రభావతి, దేవి, ఫైమీద బేగం, నజ్రీన్, రాజ్యలక్ష్మి, ప్రవళిక, నాయకులు మాలే లక్ష్మణ్ గుప్తా, షరీఫ్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa