ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రి కొండా సురేఖ బేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 02, 2024, 08:20 PM

మంత్రి కొండా సురేఖ బేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. కేటీఆర్ పట్ల కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై హరీశ్ రావు స్పందించారు. ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజకీయ వాదనల్లో పసలేకే వ్యక్తిగత దూషణలకు దిగుతారన్న మార్గరెట్ థాచర్ కోట్‌ను పోస్టుతో జతపరిచారు.కొండా సురేఖపై జరిగిన ట్రోలింగ్‌ను ఒక మహిళగా తాము ఖండించామని సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. కానీ బాధ్యతగల మంత్రిగా దిగజారి ఆమె మాట్లాడటం సరికాదన్నారు. సినిమా పరిశ్రమలో ఉన్న మహిళలపై చేసిన వ్యాఖ్యలు తీవ్రమైనవి అన్నారు. ఒక మహిళగా మరో మహిళను కించపరిచేలా మాట్లాడటం సరికాదన్నారు. తనపై ఎవరో ట్రోల్ చేస్తే కేటీఆర్‌కు ఆపాదించడం, వ్యక్తిగతంగా దూషించడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమను కామెంట్ చేసిన విషయం కొండా సురేఖ మరిచారా? అని ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa