ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాగ్ కుటుంబాన్ని రోడ్డు మీదికి లాగడం భరించరాని విషయమన్న వర్మ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 03, 2024, 03:22 PM

నాగచైతన్య-సమంత విడాకులకు కేటీఆర్ ను ముడిపెడుతూ తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర ప్రకంపనలు సృష్టించడం తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో ఎన్ కన్వెన్షన్ కూల్చకుండా ఉండడానికి కేటీఆర్ పెట్టిన ఓ షరతు నాగచైతన్య-సమంతల విడాకులకు దారితీసిందన్నది కొండా సురేఖ వ్యాఖ్యల సారాంశం. దీనిపై సినీ ప్రముఖుల తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు.తాజాగా, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఈ అంశంపై తన బాణీ వినిపించారు. నాగార్జున కుటుంబాన్ని కొండా సురేఖ అత్యంత దారుణంగా అవమానపర్చిందని పేర్కొన్నారు. కొండా సురేఖ కామెంట్లు విని తాను షాక్ అయ్యానని వర్మ వెల్లడించారు. తన రాజకీయ ప్రత్యర్థి మీద పగ తీర్చుకోవడానికి అత్యంత గౌరవనీయ నాగార్జున కుటుంబాన్ని రోడ్డు మీదికి లాగడం ఏమాత్రం భరించరాని విషయం అని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆర్జీవీ ట్వీట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa