ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించాం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 03, 2024, 03:20 PM

సంక్షేమ పథకాలు అందరికీ అందుబాటులోకి తీసుకు రావాలనే ఉద్దేశంతో ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి వెల్లడించారు. రేషన్ కార్డు కోసం గత పదేళ్లు ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగారని గుర్తు చేశారు. కేసీఆర్ అధికారంలో ఉంటే రేషన్ కార్డు రాదని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని తెలిపారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే డిజిటల్ కార్డులు అవసరమన్నారు. ప్రతి పేదవాడికి కార్డును అందించాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. రేషన్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్సుమెంట్ తదితర అవసరాలకు ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఉపయోగపడుతుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa