ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇక్కట్లు తొలగించేందుకు జాయింట్ ఇన్స్పెక్షన్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 04, 2024, 02:14 PM

మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇక్కట్లు తొలగించేందుకు జాయింట్ ఇన్స్పెక్షన్..జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సైబరాబాద్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి కలిసి పర్యటన..విస్తరణ పనులు పర్యవేక్షనున్న జలమండలి, జీహెచ్ఎంసీ, పోలీస్ శాఖలు.  ట్రిడెంట్ హెటల్ నుంచి యశోదా ఆసుపత్రి వరకు ఉన్న 5 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ పనులు.  రోడ్డు విస్తరణ పనుల్ని పరిశీలించిన జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, పోలీస్, జీహెచ్ఎంసీ అధికారులు.  ఆ ప్రాంతంలో ఉన్న జలమండలి సీవరేజ్ పైపులైన్లు, ఎయిర్ వాల్వ్‌లు తరలింపు.  తరలింపు ప్రక్రియ చేపట్టాలని ఎండీ అశోక్ రెడ్డి ఆదేశం.  పనులు పూర్తయితే మాదాపూర్, మైండ్ స్పేస్, ప్రాంతాల వారికి తొలగనున్న ట్రాఫిక్ ఇబ్బందులు


పర్వత నగర్ చౌరస్తాలో మురుగు ఔట్ లెట్‌లు లేక పొంగుతున్న మురుగు నీరు.  సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కొత్త సీవరేజ్ పైపు లైన్ల నిర్మాణం చేపట్టనున్న జలమండలి. సంబంధిత ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఎండీ అశోక్ రెడ్డి ఆదేశం. ఇక్కడ ఉత్పన్నమయ్యే మురుగు సున్నం చెరువులో కలవకుండా గుర్గం చెరువు ఎస్టీపీలోకి మళ్లింపు. ఈ రెండు కార్యక్రమాల్ని 90 రోజుల స్పెషల్ డ్రైవ్ లో భాగంగా చేపట్టి పూర్తి చేయనున్నట్లు తెలిపిన ఎండీ






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa