రైతు రుణమాఫీపై దేవుళ్ల మీద ఒట్లు వేసి మాట తప్పిన రేవంత్ మొనగాడు కాదని.. మోసగాడని BRS నేత, మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. దసరాలోపు రైతుబంధు పడకపోతే విడిచిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. దసరా తర్వాత రాహుల్ గాంధీ ఇంటిని ముట్టడిస్తామన్నారు. హైడ్రా పేరుతో పీదల ఇళ్లు కూల్చే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. కుంటిసాకుతో రుణమాఫీ ఎగ్గొట్టి.. 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేశారని విమర్శించారు. భూమి లేని నిరుపేద రైతులకు రూ.5 లక్షల రైతు భీమా పత్తా లేకుండా పోయిందని మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ ఆయన మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో రైతులు చేపట్టిన ధర్నాలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దసరాలోపు ప్రభుత్వం రైతుబంధు నిధులు విడుదల చేయాలని.. ఎకరానికి రైతుల ఖాతాల్లో రూ.7,500 జమ చేయాలన్నారు. ఇకనైనా కుంటి సాకులు చెప్పకుండా అందరికీ రూ.2 లక్షలు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa