శ్రీరామ్ పూర్ మండలంలోని పెండింగ్ లో ఉన్న భూ సమస్యలను సకాలంలో పరిష్కరించాలని అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ శ్రీరాంపూర్ తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి మండలంలో ఉన్న పెండింగ్ ధరణి సమస్యలు ,భూసేకరణ, వివిధ సర్టిఫికెట్ల జారి మొదలగు అంశాల పై రివ్యూ నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మండలంలో పెండింగ్ ఉన్న ధరణి దరఖాస్తులను ప్రణాళిక ప్రకారం పరిష్కరించాలని, క్షేత్రస్థాయిలో అవసరమైన ధ్రువీకరణ చేపట్టి పెండింగ్ దరఖాస్తులు పూర్తి చేయాలని అన్నారు.మీసేవ కేంద్రాల ద్వారా వివిధ సర్టిఫికెట్ల కోసం వచ్చిన దరఖాస్తులను సకాలంలో పరిశీలించి సంబంధిత సర్టిఫికెట్లు జారీ చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో మండల తహసిల్దార్ సంబంధిత అధికారులు,తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa