ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేదింటికి పెద్ద భరోసా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 04, 2024, 05:35 PM

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మొగిలిపాలెం గ్రామస్తులు పేదింటికీ పెద్ద భరోసా అందించారు. గ్రామానికి చెందిన పేద మహిళ కాల్వ సుమలత రెండేళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతూ ఇటీవల చనిపోయింది. పేదింట పెద్ద కష్టాన్ని చూసి చలించిన గ్రామస్తులు తమవంతుగా ఆర్థికసాయం అందించి, పేద కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచారు.
చందాల రూపంలో పోగుచేసిన రూ.78,800 సుమలత కుటుంబ సభ్యులకు అందజేశారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రమణారెడ్డి, గ్రామస్తులు ఎల్కపల్లి సంపత్, జొన్నగడ్డ లింగయ్య, చెన్నబోయిన రవి, వర్కోలు మల్లయ్య, జక్కుల శ్రీనివాస్, కేశవులు, రజాక్, మహేష్, సంపత్, మల్లేష్, విజయ్, శ్రవణ్, మల్లేష్, పోశయ్య, చంద్రయ్య కార్యక్రమంలో పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa