ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేదోడి గొంతుక ఎర్రజెండా...

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 07, 2024, 08:17 PM

పేదోడి గొంతుక ఎర్రజెండా అని, ప్రజా సమస్యలపై సిపిఐ పార్టీ తరఫున నిరంతరం పోరాటాలను కొనసాగిస్తామని, హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేస్తామని సిపిఐ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు. అనంతగిరి మండలంలోని శాంతినగర్లో నిర్మాణ, ప్రజా సంఘాల సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు హాజరై ప్రసంగించారు. నిరంతరం ఉద్యమిస్తూ వారి పక్షాన పోరాటాలు నిర్వహిస్తూ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని వారు అన్నారు. ప్రతి మనిషికి పుట్టుక చావు అనేది సహజం కానీ కమ్యూనిస్టులు మాత్రం మరణించిన ప్రజల హృదయాల్లో బతికే ఉంటారని వారన్నారుకేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకువచ్చి కార్మికుల నెత్తిన మోయరాన్ని భారాన్ని మోపి అన్యాయానికి గురిచేస్తుందని వారు అన్నారు. కార్మిక హక్కుల కోసం పేద బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఉద్యమించే ఏకైక పార్టీ కమ్యూనిస్టు పార్టీ మాత్రమేనని  వారు అన్నారు.
ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రతి కామ్రేడ్ కృషి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విదానాలను అవలంబిస్తుందని అన్నారు. వ్యవసాయ కూలీలకు ప్రకటించిన 12 వేల భృతిని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలన్నారు. అనంతరం గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సిపిఐ మండల ప్రధాన కార్యదర్శి బద్దం కృష్ణారెడ్డి,  కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa