ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫోటో, వీడియో గ్రాఫర్స్ ప్రమాణ స్వీకారంలో..పాల్గొన్న ఎమ్మెల్యే విజయరమణ రావు..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 07, 2024, 08:22 PM

సుల్తానాబాద్ మండలంలోని నర్సయ్యపల్లి విజయ ఏసీ ఫంక్షన్ హల్ లో ఆదివారం రోజున సుల్తానాబాద్ మండల ఫోటో & వీడియో గ్రాఫర్ల వెల్ఫేర్ అసోసియేషన్ ప్రమాణస్వీకార మహోత్సవం సందర్బంగా ముందుగా జ్యోతి ప్రజ్వాల చేసి ప్రమాణస్వీకారణ కార్యక్రమాన్ని ప్రారంభించి నూతనంగా ఎన్నికైన సభ్యులను ఘనంగా సన్మానించిన.
పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు.. అనంతరం నూతనంగా ఎన్నికైన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే విజయరమణ రావు. తదుపరి ఎమ్మెల్యే ని సుల్తానాబాద్ మండలం ఫోటో & వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ మండల ఫోటో & వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు,సుల్తానాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa