ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హిందూ సంఘటీత శక్తితోనే జాతి నిలబడుతుంది

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 07, 2024, 08:25 PM

శౌర్య పరాక్రమమైన వ్యక్తులు ఉన్నప్పటికీ వందల సంవత్సరాలు బానిసత్వంలో బతకడం వెనక సమిష్టితత్వం లోపించడమే ప్రధాన కారణమని, దానినుండి దేశాప్రజలను సురక్షితంగా ఉంచడం కోసం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పనిచేస్తున్నదని జాగృతి అసోసియేటెడ్ ఎడిటర్ కుర్ర దుర్గారెడ్డి అన్నారు.పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గత మూడు రోజులుగా జరుగుతున్న ప్రారంభిక్ శిక్ష వర్గ ముగింపు కార్యక్రమాన్ని పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ,  హిందూ జాతి సంఘటీత శక్తి ద్వారా మాత్రమే దేశం మనుగడ సాధించ గలుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.


ఇందుకోసమే డాక్టర్ హెగ్డే వార్ వందేళ్ల క్రితమే ఆలోచన చేసి సంఘాన్ని స్థాపించారాని తెలిపారు.హిందూ సమాజం అనేక పండగలను చేసుకోవడం జరుగుతోందని, విజయాలను అందించే విజయదశమి ప్రత్యేకమైనదని అన్నారు. ఆకట్టుకున్న పథసంచలనం.. ప్రారంభిక్ వర్గ ముగింపు సందర్భగా శిక్షర్థులు చేసిన పద సంచలనం ఆకట్టుకుంది. ఆర్ఎస్ఎస్ ప్రత్యేక వాయిధ్యాలతో ప్రధాన వీధుల గుండా రూట్ మార్చ్ కొనసాగింది.ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ విభాగ్ సర్ కార్యవాహా కొంపాల రాజన్న, మల్లోజుల కిషన్ జీ, గడ్డి రమేష్, రామగిరి శ్రీనివాస్, ప్రయకరావు నాగరాజు, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణ రెడ్డి, గొట్టిముక్కుల సురేష్ రెడ్డి, పుట్ట సదయ్య, పల్లె సధానందం, పర్శ సమ్మయ్య, బెజ్జంకి దిలీప్ కుమార్, శివంగారి సతీష్, వియ్యంకార్ సాయి, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa