వ్యవసాయ మార్కెట్ కమిటీలు రైతులకు మేలు చేసేవిగా ఉండాలని రాష్ట్ర రోడ్లు , భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రైతులకు , ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండేదే వ్యవసాయ మార్కెట్ కమిటీ అని చెప్పారు.
సోమవారం అయన దేవరకొండ నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నూతనంగా ఎంపికైన వ్యవసాయ మార్కెట్ కమిటీ రైతులకు మేలు చేయడమే ధ్యేయంగా పెట్టుకోవాలని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa