బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కోట్ల రూపాయలు వెచ్చించి మహానగరాన్ని అభివృద్ధి పదంలో దూసుకెళ్లిందని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు.సోమవారం సూరారం డివిజన్‌లోని షాపూర్‌నగర్‌లో రూ. 3.50 కోట్లతో నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నాయకులు, అధికారులతో కలిసి ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహానగరం అభివృద్ధిలో భాగంగా నగరంలో 54 ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలు, ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్ నిర్మాణాలు చేపట్టారన్నారు. హైదరాబాద్ అభివృద్ధి అంటే సీఎం రేవంత్‌రెడ్డికి మూసి మాత్రమే కనబడుతోందని, పదినెలల్లో మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లు కూలుస్తూ పాలన గాలికి వదిలేశారన్నారు.అభివృద్ధి అంటే కేవలం మూసీనే కనబడుతుందా లేక నగరంలో రోడ్ల దుస్థితి, నాలాల పరిస్థితి, మురుగునీటి సమస్య కనబడడం లేదా అని ప్రశ్నించారు. షాపూర్‌నగర్ చౌరస్తాలో నిత్యం వేలాది మంది పాదాచారులు, కార్మికులు రోడ్డు దాటేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వీరిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించడం జరిగింది. ఎట్టకేలకు బ్రిడ్జిని ప్రారంభించడంతో పాదాచారుల సమస్య తీరడం హర్షణీయమన్నారు. కార్పొరేటర్ మంత్రి సత్యన్నారాయణ, మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, యూత్ నియోజకవర్గం అధ్యక్షుడు సోమే్‌షయాదవ్, రుద్ర అశోక్, పుప్పాల భాస్కర్, శ్రీకాంత్ నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa