బడంగ్ పేట్ కార్పొరేషన్ పరిధిలోని 30వ డివిజన్ లోని లక్ష్మీనగర్ కాలనీలో, అలాగే 20వ డివిజన్ లోని వెంకటేశ్వర కాలనీలో డ్రైనేజీ నిర్మాణ పనులను మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలోని 32 డివిజన్లలో కార్పొరేషన్ ఆధ్వర్యంలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని వెల్లడించారు. ఇప్పటికే పనులు చురుకుగా సాగుతున్నాయని తెలిపారు.