చింతల మనేపల్లి మండలం లోని దిందా కెత్తిని చిత్తమ గ్రామనికి చెందినా రైతులు సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. రైతులు మాట్లాడుతూ జూలై ఆగస్టు నెలలో ప్రాణహిత పరివాహక ప్రాంతంలో ఉన్న పంట పోలలు ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహించడంతో సమీపంలోని పంట చేన్లు మునిగి పంటనష్టం వాటిల్లిందని వాపోయారు.
పంట నష్టపరిహారాన్ని రైతులకు సమాచారమివ్వక ఏఈ ప్రైవేట్ వ్యక్తులతో సర్వే చేయించి కొంతమందికే నష్ట పరిహారం వచ్చేలా చేశారని ఆరోపించారు.అనంతరం తహసిల్దార్ రెవెన్యూ ఆఫీసర్ కూ పంటనష్టపోయిన రైతులకు నష్టరిహారం చెల్లించే విధంగా కృషి చెయ్యాలని వినతి పత్రం అందజేశారు.