మంథని గురుకుల పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల కాలంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహిస్తున్న క్రీడా పోటీలలో మంథని పట్టణానికి చెందిన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాల బాలురు అత్యున్నత ప్రతిభ కనబరుస్తూ బహుమతులు కైవసం చేసుకోవడమే కాకుండా రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. మంగళవారం వీరిని ప్రిన్సిపల్ శ్రీనాథ్ ప్రత్యేకంగా అభినందించారు.