ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పిల్లల లంచ్ బాక్స్‌లో పెట్టకూడని ఫుడ్స్

Health beauty |  Suryaa Desk  | Published : Thu, Jan 30, 2025, 11:57 PM

పిల్లల పెంపకం ప్రతి తల్లిదండ్రులకు సవాల్‌తో కూడుకున్న పని. ముఖ్యం పిల్లల తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న వయసులో పిల్లల రోగనిరోధక శక్తి చాలా బలహీనంగా ఉంటుంది. అందుకే వారి ఆహారంపై తగిన శ్రద్ధ తీసుకోవాలి. పిల్లల అభివృద్ధిలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. వారి శారీరక, మానసిక అభివృద్ధికి ఆహారం ఎంతో కీలకం. అయితే, తెలిసో లేదా తెలియక కొన్ని తప్పులు తల్లిదండ్రులు చేస్తుంటారు. పిల్లల లంచ్ బాక్స్ వారి ఆరోగ్యం విషయంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే లంచ్ బాక్స్‌లో కొన్ని ఆహారాలను పెట్టకూడదు. పిల్లల లంచ్ బాక్స్‌లో కొన్ని ఆహారాలు తెలియక పెడితే, అవి వారి ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. ఆ ఫుడ్స్ ఏంటో ఓ లుక్కేయండి.


ఇన్‌స్టంట్ నూడుల్స్


చాలా మంది పిల్లలకు రెండు నిమిషాల్లో తయారయ్యే ఇన్‌స్టంట్ నూడుల్స్ అంటే చాలా ఇష్టం. ఇంట్లో కూడా పట్టుబట్టి మరీ వాటిని చేయించుకుని తింటారు. అంతేకాకుండా లంచ్‌ బాక్స్‌లో కూడా నూడుల్స్ పెట్టమని పట్టుబడతారు. దీంతో తల్లిదండ్రులు కొన్ని సార్లు ఇన్‌స్టంట్ నూడుల్స్ రెడీ చేసి లంచ్ బాక్స్‌లో పెడతారు. అయితే, పిల్లల ఆరోగ్యం గురించి ఆలోచించినట్టయితే ఈ నూడుల్స్ బాక్స్‌లో పెట్టకండి. ఎందుకంటే ఈ ఆహారం పిల్లల పేగు ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. నిజం చెప్పాలంటే పిల్లల ఆరోగ్యానికి హాని చేస్తుంది. అందుకే ఇన్‌స్టంట్ నూడుల్స్‌ని అవాయిడ్ చేయండి.


ఎక్కువగా వేయించిన ఆహారం


పిల్లల మధ్యాహ్న భోజనంలో వేయించిన ఆహారాన్ని ఎక్కువగా ఇవ్వకుండా ఉండాలి. కచోరీలు, సమోసాలు, ఫ్రెంచ్ ఫ్రైలు, చిప్స్, పకోడాలు లేదా వేయించిన స్నాక్స్ పిల్లల లంచ్ బాక్స్‌లో ఉండకూడుదు. ముఖ్యంగా బజారులో దొరికే వేయించిన చిరుతిళ్లు పిల్లలకు అస్సలు ఇవ్వకూడదు. వీటిలో అధిక మొత్తంలో అనారోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. ఇది పిల్లలలో బరువు పెరగడానికి, కడుపు సంబంధిత వ్యాధులకు కారణమవుతుంది. అందుకే వీటిని లంచ్ బాక్స్‌లో పెట్టకండి.


మిగిలిన ఆహారం


కొన్ని సార్లు తెలిసో తెలియకో చాలా మంది రాత్రి భోజనంలో మిగిలిన ఆహారాన్ని, ఉదయాన్నే వేడి చేసి పిల్లల లంచ్‌ బాక్స్‌లో ప్యాక్ చేస్తారు. ఆ సమయానికి అది ఫ్రెష్‌గా అనిపించినా, మధ్యాహ్నం సమయానికి ఫుడ్ టేస్ట్ దారుణంగా ఉంటుంది. బాక్స్ క్లోజ్ చేయడం వల్ల పోషక విలువలు కూడా గణనీయంగా తగ్గుతాయి. ఒక్కోసారి మధ్యాహ్న సమయానికి ఫుడ్ చెడిపోవచ్చు. అది తింటే పిల్లల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదముంది. అందుకే మిగిలిన ఆహారాల జోలికి పోకండి.


షుగరీ ఫుడ్స్


చాలా మంది పిల్లల భోజనం చేసిన తర్వాత ఏదైనా తీపి తింటారని భావిస్తారు. ఇందుకోసం తరుచూ లంచ్ బాక్స్‌లో చాక్లెట్స్, కుకీలు, క్యాండీస్, జెల్లీ వంటి తీపి వస్తువుల్ని ఉంచుతాయి. మీరు వీటిని తక్కువ పరిమాణంలో ప్యాక్ చేసినా, అవి పిల్లల ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావు. వీటిలో చాలా శుద్ధి చేసి చక్కెర, కృత్రిమ రంగులు, హానికర రసాయనాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. ఒకవేళ పిల్లలకు ఏదైనా తీపి ఇవ్వాల్సి వస్తే.. తాజా పండ్లు, ఇంట్లో చేసిన లడ్డూలు, బెల్లంతో చేసిన స్నాక్స్ వంటి వాటిని ఇవ్వవచ్చు.


ప్యాక్ చేసిన స్నాక్స్, క్యాన్డ్ డ్రింక్స్


ఆహారం విషయంలో కొన్ని సందర్భాల్లో పిల్లలు మొండిగా వ్యవహరిస్తారు. తల్లిదండ్రులు వద్దని చెప్పినా కొన్ని ఫుడ్స్ తినడానికి ఆసక్తి చూపుతారు. ఇక, పిల్లల మాట వినకపోవడంతో చాలా మంది మధ్యాహ్న భోజనంలో చిప్స్, నామ్కీన్, క్రాకర్స్ లేదా బిస్కెట్లు వంటి కొన్ని ప్యాక్ చేసిన స్నాక్స్ ఉంచుతాయి. అయితే ఇది పిల్లలకు 'విషం' కంటే తక్కువ కాదు. వాటిలో చాలా అనారోగ్యకరమైన కొవ్వులు, ప్రిజర్వేటివ్లు, కృత్రిమ రుచులు, అధిక మొత్తంలో చక్కెర, ఉప్పు, అనేక మసాలాలు ఉంటాయి. ఇవి పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. వీటితో పాటు ప్యాకేజ్డ్ జ్యూసులు, క్యాన్డ్ డ్రింక్స్ కూడా పిల్లలకు ఇవ్వకండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com