అసోంలోని కచార్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల మహిళకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే వీరి ఇంటికి దగ్గర్లోనే 28 ఏళ్ల యువకుడు నివాసం ఉంటున్నాడు. ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఎప్పటిలాగే మహిళ భర్త పనుల నిమిత్తం బయటకు వెళ్లాడు. ఆ విషయాన్ని గుర్తించిన ఆటో డ్రైవర్.. మహిళ ఇంటికి వచ్చాడు. నేరుగా ఇంట్లోకి వెళ్లి తలుపులు వేశాడు. అయితే ఇంట్లో మహిళతో పాటు ఆమె ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా సరే అదేమీ పట్టించుకోకుండా మహిళ వద్దకు వెళ్లి ఆమె కాళ్లు, చేతులు కట్టేశాడు.
కామ వాంఛ ఎక్కువై మహిళపైకి దూకగానే ఆమె వద్దని వారించింది. బయటకు వెళ్లిపోమంటూ తిట్టింది. పిల్లలు కూడా మా అమ్మను వదులు, మా అమ్మను వదులు అంటూ గొడవ చేశారు. ఈక్రమంలోనే సదరు డ్రైవర్ పిల్లలను కొట్టాడు. దీంతో చిన్నారులు ఇద్దరూ ఏడుస్తూ అక్కడే నిలబడిపోయారు. మహిళ ఎంత ప్రయత్నించినా అతడిని వదిలించుకోలేకపోయింది. అయినా తన ప్రయత్నాన్ని అపకుండా అతడి నుంచి తప్పించుకునేందుకు యత్నిస్తూనే ఉంది.
ఈక్రమంలోనే ఆటో డ్రైవర్.. మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణాన్ని అక్కడే ఉన్న చిన్నారులు సైతం కళ్లారా చూశారు. ఇంతటితో ఆగకుండా ఆ డ్రైవర్ సదరు మహిళపై తన వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను పోశాడు. దీంతో మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. నొప్పితో విలవిల్లాడుతూ.. అక్కడే ఏడుస్తోంది. తల్లికి ఏమైందో తెలియకు చిన్నారులు కూడా ఏడుస్తుండగా.. నిందితుడు వారి వద్దకు వెళ్లి ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ బెదిరించాడు. ఆపై అక్కడి నుంచి పారిపోయాడు.
అయితే అప్పటికే తీవ్రంగా భయపడిపోయిన చిన్నారులు ఇద్దరూ తల్లి పక్కనే కూర్చుని ఏడుస్తూనే ఉన్నారు. పని పూర్తయ్యాక ఇంటికి వచ్చిన భర్తకు భార్య గాయాలపాలు అయి ఉండడంతో పాటు చిన్నారులు ఇద్దరూ ఏడుస్తూ కనిపించారు. ఏమైందని అడిగితే వారు జరిగిందంతా చెప్పగా.. వెంటనే స్థానికుల సాయంతో భార్యను ఆస్పత్రిలో చేర్పించాడు. ప్రస్తుతం మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఆపై నేరుగా మహిళ భర్త పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ఆటో డ్రైవర్‌ను పట్టుకునేందుకు పెద్ద ఎత్తున గాలిస్తున్నారు. మరోవైపు తండ్రే దగ్గరుండి పిల్లల్లో భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ చిన్నారులు ఇద్దరూ తీవ్రంగా భయపడి ఇంకా ఏడుస్తూనే ఉన్నారు.