ట్రెండింగ్
Epaper    English    தமிழ்

Zepto వినియోగదారునికి గుడ్ న్యూస్.. ఏమిటంటే...?

business |  Suryaa Desk  | Published : Thu, Jan 30, 2025, 11:35 PM

Zepto తన వినియోగదారుల కోసం అదిరిపోయే ఫీచర్ ను ఆవిష్కరించింది. రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ఎలక్ట్రానిక్స్, అపారెల్, ఆటబొమ్మలు, స్పోర్ట్స్, కిచెన్‌వేర్ వంటి విభాగాల్లో అందుబాటులో ఉంటుందని కంపెనీ గురువారం సోషల్ మీడియాలో వెల్లడించింది.  Zepto తన కొత్త ఫీచర్ గురించి తెలియజేస్తూ.. కేవలం 10 నిమిషాల డెలివరీ సేవల్లో ఈ ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా కంపెనీ తెలిపింది. ఎలక్ట్రానిక్స్, అపారెల్, ఆటబొమ్మలు, స్పోర్ట్స్ , కిచెన్‌వేర్‌ విభాగాల్లో ఈ సేవలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి" అని పేర్కొంది.  Zepto తమ రిటర్న్ ప్రాసెస్ పూర్తిగా సౌకర్యవంతంగా ఉంటుందని.. ఇది తమ డెలివరీ వ్యవస్థ సామర్థ్యాన్ని సూచిస్తుందని తెలిపింది. వివిధ విభాగాల్లో రిటర్న్స్ పాలసీ అందుబాటులో ఉన్నప్పటికీ.. కొన్ని నియంత్రణా పరమైన కారణాల వల్ల.. ఆరోగ్యం, భద్రత, సేఫ్టీ వంటి ఉత్పత్తుల విభాగాల్లో వీటిని ఇవ్వండ లేదని పేర్కొన్నారు. రిటర్న్ ప్రాసెస్ పూర్తయిన వెంటనే.. తాము వెంటనే రీఫండ్ పాలసీని అమలు చేస్తామన్నారు.


అయితే.. యూజర్ బ్యాంక్ ప్రాసెసింగ్ సమయాన్ని బట్టి రీఫండ్ వారి ఖాతాలో జమ అయ్యే సమయం మారొచ్చని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లకు, రీఫండ్ మొత్తానికి సమానమైన కూపన్లు లేదా వోచర్లు అందిస్తాం" అని Zepto పేర్కొంది.  ఇన్నర్‌వేర్, బంగారు-వెండి నాణేలు వంటి ఉపకరణాలు, పూజా సామగ్రి (ధూపం, దీపం, పూజా వస్త్రాలు), టిష్యూలు వంటి వినియోగించగల సామగ్రి, వాటర్ ఫిల్టర్లు వంటి నిత్యవసర వస్తువులు రిటర్న్‌కు అనర్హమైనవి అని Zepto స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com