ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరోగ్యకరమైన చియాసీడ్స్ మైక్రోగ్రీన్స్‌ని ఇంట్లోనే పెంచుకోండి

Health beauty |  Suryaa Desk  | Published : Thu, Jan 30, 2025, 11:53 PM

చియా గింజల్ని బెస్ట్ సూపర్‌ఫుడ్స్ అని చెప్పొచ్చు. వీటిని ఎన్నో రకాలుగా వాడతాం. వీటిని తినడం వల్ల గట్ హెల్త్ బాగుంటుంది. బ్లోటింగ్, అజీర్తి వంటి సమస్యల వంటివి దూరమవ్వడమే కాకుండా దీని వల్ల స్కిన్, హెయిర్ వంటి సమస్యలు దూరమవుతాయి.


చియాగింజల్ని నీటిలో నానబెట్టగానే, పెద్దగా మారతాయి. అలా అయినా తీసుకోవచ్చు. వీటిని మైక్రోగ్రీన్స్‌లా కూడా తీసుకోవచ్చు. వీటిని మైక్రోగ్రీన్స్‌లా చేసుకుని సలాడ్స్, డిప్స్, యోగర్ట్, పెరుగులా చేసుకుని తీసుకోవచ్చు. వీటిని పెంచుకునేందుకు మట్టికూడా ఎక్కువగా అవసరం లేదు. పెద్దగా కష్టం అవసరంలేదు. కాబట్టి, వీటిని ఎలా పెంచుకోవాలో తెలుసుకోండి.


తీసుకోవాల్సిన మెటీరియల్స్


చియా సీడ్స్ 20 నుంచి 30 గ్రాములు


పాత జార్


బాటిల్


టిష్యూ పేపర్స్


సాఫ్ట్ క్లాత్


వాటర్ స్ప్రే బాటిల్​


ఎలా చేయాలి?


ముందుగా 2, 3 టేబుల్ స్పూన్ల చియా సీడ్స్ తీసుకోండి. వీటిని ఓ గ్లాసు నీటిలో వేయండి. వీటిని రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఓ బాటిల్ తీసుకోవాలి. సిరామిక్ జార్‌, ఏదైనా మంచి దళసరిగా ఉన్న జార్, పాత జార్ తీసుకోండి. వీటిని బాగా క్లీన్ చేయాలి. లోపల ఎలాంటి డస్ట్ లేకుండా క్లీన్ చేయండి. క్లీన్ తర్వాత కొన్ని టిష్యూలు వేసి స్ప్రెడ్ చేయండి. దానిపై కొద్దిగా నీరు స్ప్రే చేయండి. దీంతో టిష్యూ పేపర్‌ జార్‌కి అతుక్కుపోతాయి. మరీ ఎక్కువగా నీరు లేకుండా చూసుకోండి. ఇప్పుడు అందులో సీడ్స్ వేసి స్ప్రెడ్ చేయండి. నానబెట్టిన గింజలతో పాటు నానబెట్టని గింజలు కూడా వేయండి. వీటిని బాగా స్ప్రెడ్ చేయండి. ఇవి అన్నీ కూడా టిష్యూ పేపర్స్‌కి అతుక్కుంటాయి. వీటిని బాగా స్ప్రెడ్ చేయండి. నీరు తగ్గినట్టు అనిపిస్తే కొద్దిగా నీరు స్ప్రే చేసి స్ప్రెడ్ చేయండి. జెల్‌లా ఉంటాయి. అవన్నీ కూడా చుట్టూ రాయండి. ఇప్పుడు ఆ జార్ తీసుకుని బాల్కనీ లేదా కిటికీ దగ్గర పెట్టండి. గంటకోసారి నీటిని స్ప్రే చేయండి. ఇలా వారం పాటు చేయండి. రోజు చేస్తూ పొడిగా లేకుండా తడిగా ఉండేలా కొద్దికొద్దిగా నీటిని స్ప్రే చేయండి. అయితే, నీరు మరీ ఎక్కువగా నీరు వేయొద్దు. ఇలా రెగ్యులర్‌గా చేస్తే మైక్రోగ్రీన్స్ వస్తాయి.


ఎన్ని రోజులకి మొలకలు వస్తాయి


మనం జార్‌లో వేసి 3, 5 రోజులకే మొలకల్లా వస్తాయి. మొలకలు స్టార్ట్ కాగానే వీటికి గింజలకి మొదట్లో తెల్లని వేర్లలా వస్తాయి. అలాంటప్పుడు రోజుకి 2 గంటల పాటు ఎండలో ఉంచాలి. 10, 15 రోజుల తర్వాత మొలకలు పెరుగతాయి. ఇవి 5 నుంచి 8 సెంటిమీటర్లు పెరిగేలోపు ఆకులు పెరుగుతాయి.


ఆకులు పెరగడం ఆగితే


ఆకులు పెరగడం ఆగినప్పుడు వీటిని కట్ చేయాలి. వీటిని తీసుకోవడం వల్ల ఎక్కువగా పోషకాలు అందుతాయి. వీటిని మీరు సలాడ్స్, ఫుడ్స్‌లో ఎలా అయినా కలిపి తీసుకోవచ్చు. వీటిని మళ్లీ ఇలానే పెంచుకోవచ్చు. అయితే, పరిమాణంలోనే తీసుకోవాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com