ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బతికుండగానే బిడ్డను పూడ్చి పెట్టే ప్రయత్నం,,,కాటికాపరి అలర్ట్ కావడంతో బిడ్డ సురక్షితం

Crime |  Suryaa Desk  | Published : Thu, Jan 30, 2025, 11:11 PM

బతికి ఉండగానే పసిబిడ్డను అమ్మమ్మ, తాతయ్య పూడ్చి పెట్టేందుకు ప్రయత్నించిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో  కలకలం రేపింది. కాటికాపరి గమనించడంతో ఆ బిడ్డను సురక్షితంగా ఉంది. ఉంగుటూరు మండలం బాదంపూడికి సంధ్య కుమారి ఈ నెల 28న తణుకులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ పసికందు తలలో సమస్య ఉందని.. ఎక్కువ కాలం బతికడని చెప్పారు. ఈ విషయం తెలియడంతో సంధ్య కుమారి తల్లిదండ్రులు


దారుణమైన ఆలోచన వచ్చింది. బిడ్డను తీసుకుని అమ్మమ్మ, తాతయ్యలు తాడేపల్లిగూడెం పట్టణంలోని ఈశాన్యం మూల హిందూ శ్మశానానికి వెళ్లారు.. అక్కడ పూడ్చి పెట్టేందుకు ఇద్దరు తెలిసిన వ్యక్తులకు డబ్బులు ఇచ్చి ఏర్పాట్లు చేశారు. ఈ విషయం పసికందు తల్లిదండ్రులకు తెలియదు.


  శ్మశానంలో బిడ్డను పూడ్చి పెడుతుండగా.. ఒక్కసారిగా బిడ్డ పెద్దగా ఏడవడంతో అక్కడే ఉన్న కాటికాపరి వెంటనే గమనించి పెద్దగా కేకలు వేశాడు. ఇంతలో పసికందును పూడ్చేందుకు వచ్చిన ఇద్దరిలో ఒకరు పారిపోయారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించగా.. వారు వెంటనే శ్మశానం దగ్గరకు ఐసీడీఎస్ అధికారులతో కలిసి చేరుకుని బిడ్డను తాడేపల్లిగూడెం ఆసుపత్రికి తరలించారు. పసికందు తల్లిదండ్రులను పిలిచి వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com