ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నోబెల్ శాంతి బహుమతి రేసులో ఎలాన్ మస్క్

international |  Suryaa Desk  | Published : Thu, Jan 30, 2025, 10:49 PM

టెస్లా, ఎక్స్ అధినేత అయిన ఎలాన్ మస్క్ పేరు నోబెల్ శాంతి బహుమతి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారంగా పేరు పొందిన నోబెల్ శాంతి బహుమతి 2025 రేసులో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలోనూ ఓసారి ఈయన పేరును నోబెల్ శాంతి బహుమతి కోసం నామినేట్ చేయగా.. మస్క్‌కు బహుమతి లభించలేదు. అయితే ఈసారి ఆయన పేరును ఎవరు ప్రతిపాదించారు, ఎందుకు ఆయనకు ఈ బహుమతి రావాలని కోరుకుంటున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


ఎక్స్, స్పేస్‌ఎక్స్, టెస్లా వంటి కంపెనీల అధినేత అయిన ఎలాన్ మస్క్ నోబెల్ శాంతి బహుమతి 2025 అబ్యర్థిత్వానికి ఎంపిక అయినట్ల యూరోపియన్ పార్లమెంట్ సభ్యుడు బ్రాంక్ గ్రిమ్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. భావ ప్రకటనా స్వేచ్ఛ, మానవ హక్కులపై మస్క్ ఎక్స్ వేదికగా తన నిబద్ధతను చాటుకున్నారని చెప్పుకొచ్చారు. ఈక్రమంలోనే ఆయనకు నోబెల్ శాంతి బహుమతి అందాలని కోరుటుంటున్నట్లు వివరించారు.


అయితే జనవరి 29వ తేదీన ఆ అభ్యర్థిత్వాన్ని సమర్పించినట్లు కూడా బ్రాంక్ గ్రిమ్స్ స్పష్టం చేశారు. ఇందుకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. అయితే గతేడాది కూడా మస్క్ పేరు నోబెల్ శాంతి బహుమతి 2024 రేసులో వినిపించింది. అప్పుడు నార్వేకు చెందిన పార్లమెంట్ సభ్యుడు మారియస్ నీల్సన్.. గతేడాది ఫిబ్రవరి నెలలో మస్క్ పేరును ప్రతిపాదించారు. కానీ అప్పుడు ప్రపంచ కుబేరుడికి ఆ బహుమతి అందలేదు.


కానీ ఈసారి కచ్చితంగా రావాలని కోరుకుంటున్నట్లు ఎలాన్ మస్క్ అభిమానులు, మద్దతు దారులు చెబుతున్నారు. సోషల్ మీడియా వేదికగానే.. ఎలాన్ మస్క్ భావ ప్రకటనా స్వేచ్ఛను రక్షించడానికి చేసిన కృషికి గాను 2025 నోబెల్ శాంతి బహుమతి రావాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.


నోబెల్ శాంతి బహుమతికి ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారంగా గుర్తింపు ఉంది. ప్రతీ సంవత్సరం ఆరు విభాగాల్లో (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్, ఎకనమిక్స్, లిటరేచర్, శాంతి) నోబెల్ పురస్కారాలను ప్రకటిస్తారు. అయితే ఎంపిక ప్రక్రియ చాలా కఠినంగా ఉంటుంది. ప్రతీ ఏడాది అక్టోబర్ నెల మధ్యలో ఈ బహుమతి కోసం అభ్యర్థుల పేర్ల నమోదు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. జనవరి 31వ తేదీకి గడువు ముగుస్తుంది.


అయితే ఫిబ్రవరి మధ్యలో మూల్యాంకనం కోసం నోబెల్ కమిటీకి నామినేషన్లు సమర్పించగా.. చెల్లుబాటయ్యే నామినేషన్లను మాత్రమే కమిటీ సమీక్షిస్తుంది. ఆ తర్వాత అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి.. శాశ్వత కన్సల్టెంట్, అంతర్జాతీయ నిపుణుల సాయంతో నోబెల్ బహుమతి విజేతలను గుర్తిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com