ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళలు తెగలు తింటే వచ్చే బెనిఫిట్స్ ఇవే ....

Health beauty |  Suryaa Desk  | Published : Thu, Jan 30, 2025, 11:48 PM

తేగల్లో విటమిన్ B, విటమిన్ C అధికంగా ఉంటాయి. 100 గ్రాముల తేగల్లో 87 కిలో క్యాలరీలతో పాటు 77 గ్రాముల నీరు ఉంటుంది. ఇవి శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఆస్టియోపోరోసిస్, నరాల సంబంధిత సమస్యలు, కీళ్ల నొప్పులను తగ్గించేందుకు ఇది సహాయపడుతుంది. తేగల్లో ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్ ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది గుండె జబ్బుల అవకాశాన్ని తగ్గిస్తుంది. అంతే కాకుండా.. ఇది శరీర కణాలను రక్షించడంతో పాటు శరీర అవయవాలకు రక్షణ కల్పిస్తుంది. తేగల్లో అధికంగా ఫైబర్ ఉండటం వల్ల రక్తంలో షుగర్ స్థాయిని నియంత్రించేందుకు సహాయపడుతుంది. దీని వల్ల మధుమేహ రోగులు దీనిని తినొచ్చు. అయితే దీనిలోని కొన్ని పోషకాలు ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి. అందువల్ల డాక్టర్ల సలహాతో లిమిటెడ్ గా మాత్రమే తీసుకోవడం మంచిది. తేగల్లో అధిక ఫైబర్ ఉండటం వల్ల జీర్ణవ్యవస్థకు మంచిది. ఇది మలబద్ధకాన్ని తొలగించడంతో పాటు కడుపులో పేరుకునే పురుగులను నివారించగలదు. అలాగే రక్తంలో కొలెస్ట్రాల్ పెరగకుండా అదుపు చేస్తుంది.


తేగల్లో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఇది ఎముకలకు, దంతాలకు బలాన్ని అందిస్తుంది. పిల్లలకు ఇది మేలైన ఆహారం. ఇది ఎముకల సమస్యలు, కండరాల నొప్పులను తగ్గించేందుకు సహాయపడుతుంది. దీని‌లో మెగ్నీషియం కూడా ఉండటం వల్ల ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. తేగలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మహిళల్లో క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధించడంలో సహాయపడతాయి. ఇందులో విటమిన్ ఎ, అమైనో ఆమ్లాలు, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. 40 ఏళ్లు పైబడిన మహిళలు తరచుగా ఐరన్ లోపంతో బాధపడుతుంటారు. ఇది రుతుక్రమం ఆగిపోయే సంబంధిత ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. తేగలను ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచడానికి, సరైన రక్త ప్రసరణను నిర్ధారించడానికి, శరీరానికి ఆక్సిజన్ అందించడానికి సహాయపడుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com