దేవరకొండ పట్టణంలోని ఆర్డిఓ కార్యాలయంలో నూతనంగా వచ్చిన ఆర్డిఓ సామల రమణారెడ్డిని బీసీ సంక్షేమ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపినారు. మీరు దేవరకొండకు రావడం చాలా సంతోష దయకమని కొనియాడారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సామాజికవేత్త డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ,దేవరకొండ రెవిన్యూ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి కోనోకార్పస్ మొక్కలు ప్రాణాంతకరమైనది వీటి పైన పక్షి కూడా వాలని పరిస్థితి ఉంది.పర్యావరణంలో జీవించేటటువంటి ప్రతి జీవకోటికి ప్రాణాంతకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
అని శాస్త్రవేత్తలు వెల్లడించారు.క్యాన్సరు,శ్వాసకోశ సంబంధ వ్యాధులు అటువంటి వచ్చే అవకాశం ఉంది.భూగర్భ జలాలు కూడా తగ్గిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే మొక్కలను తొలగించి మానవాళి మనుగడ కాపాడాలని కోరారు.ఈ కార్యక్రమంలో చోల్లేటి భాస్కరాచారి, రాసమల్ల నాగయ్య, రెడ్డి కోటేశ్వరరావు,స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు సిరిగదల విఠలాచారి,గౌరోజు బ్రహ్మచారి, ముసిని సత్యం తదితరులు పాల్గొన్నారు.