ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంట్రాక్ట్​ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే, మంత్రి సీతక్క కీలక ప్రకటన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 05, 2024, 06:54 PM

పంచాయతీరాజ్, గ్రామీణ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ఉద్యోగులు, సిబ్బందికి ఆ శాఖ మంత్రి సీతక్క తీపి కబురు చెప్పారు. ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే రెగ్యులర్గా జీతాలు అందిస్తామని అన్నారు. ఈ శాఖల్లో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులు, సిబ్బంది వేతనాలకు సంబంధించిన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణ శాఖల్లో తెలంగాణ వ్యాప్తంగా ఎంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, సిబ్బంది పనిచేస్తున్నారు.? వారికి ప్రతి నెలా వేతనాల రూపంలో ఎంత చెల్లిస్తున్నారనే వివరాలు సేకరించాలని ఆదేశించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు వారికి నెలనెలా జీతాలు అందేలా కొత్త పాలసీ తీసుకురావాలని ఆదేశించారు.


మంత్రి సీతక్క ఆదేశాల మేరకు అధికారులు ఆ దిశగా కసరత్తు చేశారు. ఉద్యోగుల జాబితా సిద్ధం చేసి ఫైల్ను ఆర్థిక శాఖకు ఇప్పటికే పంపించారు. ఆర్థిక శాఖ నుంచి ఆమోదం లభిస్తే వెంటనే ఉద్యోగులు, సిబ్బందికి నెలనెలా జీతాలు అందనున్నాయి. కాగా సెర్ప్ ఉపాధి హామీ పథకంలో పంచాయ‌‌‌‌‌‌‌‌తీ రాజ్, గ్రామీణాభివృద్ధి, వివిధ విభాగాల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో వేలాది మంది విధులు నిర్వహిస్తున్నారు. ఈజీఎస్, ఈజీఎంఎం, ఎస్‌ఆర్‌డీఎస్, సోషల్ ఆడిట్, సీఆర్‌డీ, ఎస్బీఎం, మిషన్ భగీరథ, స్వచ్ఛ భారత్ మిషన్, పీఆర్ ఇంజినీరింగ్ తదితర విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నారు. మరికొందరు టెక్నికల్ అసిస్టెంట్లు, ఆఫీస్ స్టాఫ్, సెర్ప్, వీఏవోలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లుగా పలువురు విధులు నిర్వర్తిస్తున్నారు. మొత్తం 15 నుంచి 20 విభాగాల్లో దాదాపుగా 92 వేల మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు.


వీరికి ప్రతినెలా జీతాల రూపంలో దాదాపుగా రూ.117 కోట్లు చెల్లిస్తున్నారు. అయితే బడ్జెట్ కేటాయింపుల సమయంలో వీరి జీతాల‌‌‌‌‌‌‌‌కు సైతం ప్రత్యేక నిధులు కేటాయించాల్సి ఉంది. కాగా, వివిధ పథకాల అమ‌‌‌‌‌‌‌‌లు, శాలరీలు ఒకే ఖాతా కింద నిర్వహిస్తుండడంతో అవ‌‌‌‌‌‌‌‌స‌‌‌‌‌‌‌‌రాన్ని బ‌‌‌‌‌‌‌‌ట్టి నిధులు అటూ ఇటూ మళ్లిస్తున్నారు. దీంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల చెల్లింపునకు సమస్యలు ఎదురవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు జీతాల‌‌‌‌‌‌‌‌ు, పథకాల అమ‌‌‌‌‌‌‌‌ల కోసం వేర్వేరుగా బ‌‌‌‌‌‌‌‌డ్జెట్ కేటాయింపులు చేయాల‌‌‌‌‌‌‌‌ని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.


ఈ నిర్ణయాలతో పాటుగా.. క్షేత్ర స్థాయిలో మాన్యువ‌‌‌‌‌‌‌‌ల్‌గా చెల్లింపుల ప్రక్రియ ఇక నుంచి ఆన్‌లైన్‌లోనే ఏక‌‌‌‌‌‌‌‌కాలంలో సిబ్బందికి జీతాలు అందేలా పీఆర్, ఆర్డీ శాఖలు నూతన విధానాన్ని అనుసరించనున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల మాదిరిగానే కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తారీఖునే జీతాలు జమ అవుతాయి. ఈ నిర్ణయంపై ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com