ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జోర్డాన్ యువరాజుతో మోదీ మ్యూజియం సందర్శన

national |  Suryaa Desk  | Published : Tue, Dec 16, 2025, 03:56 PM

ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటనలో భాగంగా జోర్డాన్‌ను సందర్శించారు. సోమవారం సాయంత్రం అమ్మాన్‌ చేరుకున్న ఆయనకు జోర్డాన్ ప్రధాని జాఫర్ హసన్ స్వాగతం పలికారు. మంగళవారం, ప్రధాని మోదీ జోర్డాన్ మ్యూజియాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా, జోర్డాన్ యువరాజు అల్‌ హుస్సేన్‌ బిన్‌ అబ్దుల్లా-2 స్వయంగా కారు నడుపుతూ మోదీని మ్యూజియానికి తీసుకెళ్లడం విశేషం. ఈ మ్యూజియంలో పురావస్తు, చారిత్రక కళాఖండాలు ప్రదర్శిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa