ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతుల కన్నీళ్లను కాస్త చూడు రేవంత్: కేటీఆర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 06, 2024, 02:39 PM

కల్లాల్లో కాంటా ఎప్పడు వేస్తారో తెలియక రైతులు కంటనీరు పెట్టుకుంటున్నారని, రైతులు పడుతున్న గోసను సీఎం రేవంత్ పట్టించుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్ సూచించారు. ఈ మేరకు బుధవారం ఉదయం కేటీఆర్ ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు.
"గుట్టలను మట్టిచేసి భూదాహం తీర్చుకోవడం కాదు రేవంత్.. గుట్టల్లా పేరుకుపోయిన ధాన్యం రాశుల వైపు చూడు. గాలిమోటర్లో మూటలు మోసుడు కాదు.. కొనేవారు లేక పేరుకుపోయిన ధాన్యం మూటల వైపు చూడు" అని ఓ ట్వీట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa