వికారాబాద్ మున్సిపల్ పరిధిలో శివా రెడ్డి పేట్ గ్రామం నందు 133, 134 పోలింగ్ స్టేషన్ లను సందర్శించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పక ఓటరుగా నమోదు చేసుకోవాలని అన్నారు ఓటరు లిస్ట్ లో మార్పులు చేర్పులు తదితర అంశాల కోసం అన్ని పోలింగ్ కేంద్రాలలో బి ఎల్ ఓ అధికారులు సిద్ధంగా ఉంటారని ఆయన తెలిపారు.
ఓటర్ గా నమోదుకు నేడు, రేపు బూత్ స్థాయిలో ప్రత్యేక క్యాంప్ లు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. జనవరి 1, 2025 నాటికి 18 సం.లు నిండిన ప్రతి అర్హులైన వారు ఓటర్ గా నమోదు చేసుకోవడానికి మరో అవకాశం అని,ఓటర్ జాబితా లో తమ పేరు ఉందో ఓటర్ చెక్ చేసుకొని,ఓటర్ గా పే రు లేకుంటే ఫారం 6 ద్వారా పోలింగ్ బూత్ లో ఉన్న బి.ఎల్.ఓ దగ్గర నమోదు చేసుకోవాలని అన్నారు.పోలింగ్ బూత్ లలో బూత్ స్థాయి అధికారులు ఉదయం 10 గంటల నుండి అందుబాటులో ఉంటారని కలెక్టర్ తెలిపారు .అన్ని పోలింగ్ బూత్ లలో ఫారం 6,7,8,8A దరఖాస్తులు బి.ఎల్.ఓ.ల దగ్గర అందు బాటు లోవుంటాయని అన్నారు. 18 సం.లు నిండిన వారు రెండు కలర్ పాస్ పోర్ట్ సైజ్ ఫోటో లు,నివాస,వయస్సు దృవీకరణ పత్రం తీసుకొని రావాలని అన్నారు. ఆన్ లైన్ లో www.nvsp. ఇన్.వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు.ఓటర్ నమోదు సమాచారం కొరకు 1950 టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి సమాచారం తెలుసు కోవచ్చని ఆయన తెలిపారు.
ఈ పోలింగ్ స్టేషన్ పరిది లో ఎంత మంది ఓటర్లు ఉన్నారు, లిస్ట్ లో ఏవైనా మార్పులు ఉన్నాయా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ సుధీర్, తహసీల్దార్ లక్ష్మి నారాయణ, బి ఎల్ ఓ లు స్వరూప, అనురాధ తదితరులు పాల్గొన్నారు.