వికారాబాద్ జిల్లా పట్టణ పరిధిలో నీ సెయింట్ జూడ్స్ పాఠశాలలో కన్నుల పండుగగా మెగా కార్నివాల్. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రభుత్వ ఆసుపత్రి సుపారీడెంట్ డాక్టర్ రామచంద్రయ్య పాఠశాల ప్రిన్సిపల్ ఉషారాణి ఆధ్వర్యంలో మెగా కార్నివాల్ ను ఘనంగా నిర్వహించిన యాజమాన్యం. ఈ కార్యక్రమానికి ముందు జ్యోతి ప్రజ్వలన నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించిన డాక్టర్ రామచంద్రయ్య. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో పిల్లలు ఫోన్లు వాడడం ప్రమాదకరమని అన్నారు. పిల్లలు ఫోన్లో చూస్తే తమ పనులకు ఎలాంటి డిస్టబెన్స్ ఉండదని తల్లిదండ్రులు కూడా చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. కానీ పిల్లలు ఫోన్లు చూడటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని రామచంద్రయ్య తెలియజేశారు. పిల్లలు ప్రతి ఒక్కరూ సెల్ఫోన్లకు బానిసలుగా మారుతున్నారని ఆయన అన్నారు.
షాపింగ్ నుంచి బ్యాంకింగ్ సేవల వరకు అన్ని మనం కూర్చున్న చోట నుంచి సెల్ ఫోన్లతోనే జరుగుతున్నాయని రామచంద్రయ్య అన్నారు. వీటి వాడకం వల్ల పనులన్నీ ఈజీగా అయిపోయినట్టుగా అనిపించిన మనకు తెలియకుండానే సోమరులుగా మారిపోతున్నామన్నారు. కరోనా కంటే ముందు పిల్లలకు మొబైల్ ఫోన్లను ఇచ్చే వారే కాదని కానీ కరోనాకాలం మొదలైనప్పటి నుంచి ఆన్లైన్ క్లాసుల వల్ల స్కూల్ కాలేజీ పిల్లలు మొబైల్ ఫోన్లకు బాగా అలవాటు పడ్డారన్నారు. చిన్నపిల్లల ఏడుపును ఆపడానికి సెల్ ఫోన్ అలవాటుగా చేస్తున్నారు తల్లిదండ్రుల అని అన్నారు. కానీ ఫోన్ లో నుంచి వెలువడే విద్యుత్ దయస్కాంత వికిరణం పిల్లల ఆరోగ్యానికి చాలా డేంజర్ అని డాక్టర్ రామచంద్రయ్య తెలిపారు. సెల్ఫోన్ నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలుచాలా ప్రమాదకరమని అన్నారు. పిల్లల మెదడు పెద్దల మెదడు కంటే రెట్టింపు రేడియేషన్లను గ్రహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని ఆయన తెలియజేశారు. సెల్ ఫోన్ నుంచి వెలువడే యువి కిరణాలు పిల్లల కళ్ళను దెబ్బతీస్తాయన్నారు. సెల్ ఫోన్ పిల్లలు వాడడం వల్ల నిద్రలేమి మెదడు పనితీరు తగ్గడం జ్ఞానం కొన్నిసార్లు పిల్లల ప్రవర్తనను కూడా ప్రభుత్వం చేస్తుందని ఆయన తెలుగు చేశారు. సెల్ ఫోన్ పిల్లలు ఎక్కువగా చూసే పిల్లల్లో మాట్లాడటంలో ఆలస్యం మానసిక వైకల్యం గందరగోళం ఆలోచనలోపం శారీరక శ్రమ తగ్గడం వల్ల ఉభయ కాయం ఎముకల ఆరోగ్యం దెబ్బ తినడం వంటి సమస్యలు వస్తాయని సెల్ ఫోన్ వాడటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చినా నేను ఈ సెల్ ఫోన్ వాడకం అనివార్యంగా మారిందని రామచంద్రయ్య తెలియజేశారు. పిల్లలకు ఎక్కువగా ఫోన్లు ఇవ్వడాన్ని మాత్రం కచ్చితంగా ఆపాలని ఆయన తెలియజేశారు. సెల్ ఫోన్ కు బదులుగా తల్లిదండ్రుల తమ పిల్లలను దగ్గర్లో ఉండే పార్కులు లేదా బీచ్ లోకి తీసుకెళ్లాలని సూచించారు. పిల్లలు మానసికంగా ఉత్సాహంగా ఉండాలంటే ఆటపాటల్లో ముందుండే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమం అనంతరం పాఠశాలలో నిర్వహించిన మెగా కార్నివాల్ కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ ఉషారాణి తో కలిసి పిల్లలు తయారుచేసిన తెలంగాణ సాంప్రదాయ వంటకాలను. తెలంగాణ పండుగలను గొర్రెల కాపరులుగా వేషధారణలో నిర్వహించిన విద్యార్థులను భారతదేశ రాష్ట్రాల డ్రెస్ల విధానంలో ఉన్న విద్యార్థులను ప్రేమతో పలకరించారు. వాటి పద్ధతులు ఏంటి అని విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో అత్యంత ముఖ్యంగా నిర్వహించే దీపావళి పండుగ దీపాలను విద్యార్థులు పాఠశాల ఆవరణంలో ఘనంగా వెలిగించారు.విద్యార్థులకు తెలంగాణ పండుగలు ప్రాముఖ్యతను తెలంగాణ సాంప్రదాయాలను భారతదేశ పద్ధతులను సాంప్రదాయాలను ప్రతి విద్యార్థి తెలుసుకొనే విధంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ మెగా కార్నివాల్ నిర్వహిస్తున్నామని పాఠశాల ప్రిన్సిపాల్ ఉషారాణి తెలియజేశారు. మెగా కార్నివాల్ లో విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు నృత్య ప్రదర్శన తల్లిదండ్రులను చూపరులను చాలా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మూడవ తరగతి విద్యార్థినీ నాలుగో తరగతి విద్యార్థినులు చేసిన డ్యాన్సులు తల్లిదండ్రులను ఆనందింప చేసే విధంగా చేశాయి. ఇంత మంచి ప్రావీణ్యం కల్పించిన ఉపాధ్యాయులను తల్లిదండ్రులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం విద్యార్థినీలు విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.