TG: మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయన కుటుంబసభ్యులను మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 'వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపైన జరిగిన దాడిని ఖండిస్తున్నాం. ఈ దాడి BRS చేయించిందని అంటగట్టే ప్రయత్నం జరుగుతున్నది. నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేస్తే BRS సైలెంట్ అవుతుందనుకుంటున్నారని.. కానీ మేం అరెస్టులకు భయపడం.. ప్రజా గొంతుకగా ఉంటాం' అని సబితా అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa