మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని 31వ వార్డు, వీరన్న పేటలో నూతనంగా నిర్మిస్తున్న బైపాస్ రోడ్డును శుక్రవారం సాయంత్రం మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు.
కాలనీ వాసులు రోడ్డు సమస్య ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని రాగా.. ఆర్&బి అధికారులతో ఫోన్లో మాట్లాడి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని సూచించారు. తన వద్దకు వచ్చిన సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa