ప్రజా పాలన ఉత్సవాలలో భాగంగా శనివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న రాష్ట్రవ్యాప్త రైతు పండగ ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి విచ్చేస్తున్న సందర్భంగా బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. ఈ సభను వియజవంతం చేయాలని కోరుతూ ప్రజలు, రైతులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో ప్రజా పాలన ఉత్సవాలకు బయలుదేరారు. అమిస్తాపూర్ వద్ద శనివారం నిర్వహిస్తున్న రాష్ట్రవ్యాప్తంగా రైతు పండగ ఉత్సవాలకు నారాయణఖేడ్ నుండి ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి ఆధ్వర్యంలో 3 బస్సులలో రైతులు తరలివెళ్లారు. ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రానున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa