ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రైవేట్ స్కూల్ బస్సును ఢీకొని యువకుడు మృతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 10, 2024, 04:29 PM

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని ఎన్నెకేపల్లి గ్రామ పరిధిలో మంగళవారం ఉదయం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు- బైక్ ఢీకొన్నాయి. బైక్ పై ఉన్న మొండివగు గ్రామానికి చెందిన ఇమ్రాన్ అక్కడిక్కడే మృతి చెందాడు. పని నిమిత్తం ఎన్నికేపల్లి గేట్ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. చేవెళ్ల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa