మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దులోని మాకోడి రైల్వే క్యాబిన్ సమీపంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. మంగళవారం రాత్రి, అన్నూరు గ్రామం వద్ద రైల్వే పట్టాలు దాటుతున్న పులిని స్థానికులు గమనించి, తమ ఫోన్లలో చిత్రీకరించారు. ఈ విషయాన్ని రైల్వే అధికారులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురవుతుండగా, బుధవారం ఉదయం హుడికిలి గ్రామంలో జరిగిన మరొక దాడి మరింత కలవరానికి దారితీసింది. గ్రామంలో ఓ ఇంటి వద్ద కట్టేసి ఉన్న దూడపై పులి దాడి చేసి చంపేసింది.
ఫారెస్ట్ అధికారులు ఈ సంఘటనలపై స్పందించి, పులి కదలికలను ట్రాక్ చేయడానికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాత్రివేళ గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పులి ప్రదేశం పరిధిని గుర్తించి, దానిని సురక్షితంగా అటవీ ప్రాంతానికి తరలించడానికి చర్యలు చేపట్టనున్నట్లు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa