సినీ నటుడు నాగార్జున వేసిన పరువు నష్టం కేసులో తాను కోర్టుకు హాజరుకాలేకపోతున్నానని, మరో తేదీ ఇవ్వాలని తెలంగాణ మంత్రి కొండా సురేఖ కోర్టును కోరారు. దీంతో నాంపల్లి కోర్టు విచారణను వాయిదా వేసింది.తనపై చేసిన వ్యాఖ్యలకు గాను నాగార్జున మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం కేసు వేశారు. ఈ కేసులో మంత్రికి ఇదివరకే కోర్టు సమన్లు జారీ చేసింది. వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది.అయితే మంత్రిగా వివిధ కార్యక్రమాల కారణంగా సురేఖ విచారణకు హాజరు కాలేకపోతున్నారని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మరో తేదీ ఇస్తే హాజరవుతారని కోర్టుకు తెలిపారు. దీంతో నాంపల్లి కోర్టు విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది.