తన నివాసం వద్ద జరిగిన ఉద్రిక్తతపై మోహన్‌బాబు మరోసారి స్పందించారు. ఆ ఘటనలో గాయపడిన జర్నలిస్ట్‌కు క్షమాపణలు చెబుతూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.ఈ మేరకు సదరు మీడియా సంస్థకు బహిరంగ లేఖ రాశారు.ఇటీవల జరిగిన దురదృష్టకర సంఘటనను అధికారికంగా ప్రస్తావించడంపై విచారం వ్యక్తంచేస్తూ ఈ లేఖ రాస్తున్నాను. వ్యక్తిగత కుటుంబ వివాదంగా మొదలై.. ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో జర్నలిస్ట్ సోదరుడికి బాధ కలిగించినందుకు నాకు కూడా బాధగా ఉంది. ఇది జరిగిన తర్వాత అనారోగ్య కారణాల వల్ల 48 గంటలు ఆసుపత్రిలో చేరడం వల్ల వెంటనే స్పందించలేకపోయాను. నేను అతడి సహనాన్ని అభినందిస్తున్నా. ఆరోజు నా ఇంటి గేటు విరిగిపోయి.. దాదాపు 50 మంది వ్యక్తులు ఇంట్లోకి వచ్చారు. దీంతో నేను సహనాన్ని కోల్పోయాను. ఈ గందరగోళం మధ్య మీడియా ప్రతినిధులు అనుకోకుండా వచ్చారు. నేను పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించాను. ఆ ప్రయత్నంలో ఒక జర్నలిస్ట్‌కు గాయమైంది. ఇది చాలా దురదృష్టకరం. అతడికి, అతడి కుటుంబానికి కలిగిన బాధకు నేను తీవ్రంగా చింతిస్తున్నాను. హృదయపూర్వకంగా క్షమించమని కోరుతున్నా. త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా' అని లేఖలో రాసుకొచ్చారు
జల్‌పల్లిలో సినీనటుడు మోహన్‌బాబు నివాసం వద్ద మంగళవారం రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణ అదనపు డీజీపీని కలిసిన అనంతరం మనోజ్ దంపతులు మోహన్‌బాబు నివాసానికి చేరుకోగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. భద్రతా సిబ్బంది గేట్లు తీయకపోవడంతో మనోజ్ అక్కడి భద్రతా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. గేట్లు తోసుకొని లోపలికి దూసుకెళ్లారు. ఆయనతో పాటు అక్కడ ఉన్న మీడియా సిబ్బంది కూడా మోహన్‌బాబు ఇంట్లోకి వెళ్లారు. ఈ ఉద్రిక్తతల నడుమ మోహన్‌బాబు తీవ్ర అసహనానికి గురయ్యారు. అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. కొందరు ప్రతినిధులపై ఆయన చేయి చేసుకున్నారు. దీంతో ఆ జర్నలిస్ట్‌కు గాయమైంది.