నగరంలోని బేగంబజార్‌లో దారుణం చోటు చేసుకుంది. భార్య, కుమారుడిని చంపి భర్త సిరాజ్ ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యను గొంతు కోసి, కుమారుడిని గొంతు నులిమి హతమార్చాడు.అనంతరం సిరాజ్ ఉరేసుకుని తనువు చాలించాడు. ఈ ఘటనను చూసి అతడి పెద్ద కుమారుడు భయంతో పారిపోయాడు. కుటుంబ కలహాలే దీనికి కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సిరాజ్ కుటుంబం ఉత్తర్‌ప్రదేశ్ నుంచి వలస వచ్చినట్లు గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.