జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం గోవిందుపల్లె గ్రామ బిఆర్ఎస్ పార్టీ శాఖ అధ్యక్షులు కోల శంకరయ్య తేదీ 27 జులై 2024 న రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది.బి అర్ ఎస్ పార్టీ సభ్యత్వం ద్వారా మంజూరైన 2 లక్షల ఇన్సురెన్స్ చెక్కును మాజి మంత్రి కొప్పుల ఈశ్వర్ శుక్రవారం శంకరయ్య భార్య మమతకి అందించడం జరిగింది.
ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ మరణించిన కార్యకర్త కుటుంబానికి పార్టీ ఇన్సురెన్స్ చెక్కు కొండత భరోసా అన్నారు.పార్టీ కార్యకర్త మరణిస్తే రెండు లక్షల రూపాయల భీమా అందిస్తున్న ఏకైక పార్టీ దేశంలో తెరాస ఒక్కటే అన్నారు.ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa