తెలంగాణలో గతేడాదితో పోలిస్తే సైబర్ నేరాలు 18 శాతం పెరిగాయని సీఐడీ డీజీ షికా గోయల్ తెలిపారు. తెలంగాణలో ఈ ఏడాది సైబర్ నేరాలకు సంబంధించిన రిపోర్టును డీజీ వెల్లడించారు. ‘సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు 1.14 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఏడాది సైబర్ క్రైమ్ ద్వారా రూ.1,866 కోట్లను సైబర్ నేరస్తులు దోచుకున్నారు. పలు కేసులకు సంబంధించి 1,057 మంది సైబర్ నేరస్తులను అరెస్ట్ చేశాం’ అని తెలిపారు.