సినీ నటుడు అల్లు అర్జున్‌పై మేడిపల్లి పోలీసులకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫిర్యాదు చేశారు. పుష్ప-2 సినిమాలో పోలీస్ ఆఫీసర్ స్విమ్మింగ్ పూల్‌లో ఉండగా హీరో ఉచ్చ పోశాడని.. అలాగే ఈ చిత్రంలోని కొన్ని సీన్స్ పోలీసులను కించపరిచే విధంగా ఉన్నాయని ఆయన తన కంప్లైంట్లో రాశారు. హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్, సినిమా నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని మేడిపల్లి పోలీస్ స్టేషన్లో మల్లన్న ఫిర్యాదు చేశారు.పోలీసులను అగౌరవ పరిచే ఇలాంటి సీన్లు తీసినందుకు డైరెక్టర్ సుకుమార్, ప్రొడ్యూసర్, హీరో అల్లు అర్జున్ పై చర్యలు తీసుకోవాని ఫిర్యాదులో పేర్కొన్నారు. సెన్సార్ బోర్డు ఆ సీన్ కట్ చేయాల్సిందని, ఎందుకు అనుమతించిందో తెలియదని అన్నారు. ఇటువంటి సినిమాల ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారోనని విమర్శించారు. స్మగ్లర్లను హీరోలాగా చూపిస్తే నేటి యువత చెడు మార్గంలో వెళ్తుందని, ఇది సమాజాన్ని నాశనం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి సినిమాలను నిషేధించి మంచి సినిమాలను ప్రోత్సహించాలని, పదిమందికి ఉపయోగపడే సినిమాలను తీయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇటువంటి సినిమాలు తీసిన దర్శకనిర్మాతలు, నటించిన హీరోలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. డిమాండ్ చేస్తున్నా అని తీన్మార్ మల్లన్న తెలియజేశారు.