అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అనుచితమైన వ్యాఖ్యలు నిరసిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మంగళవారం కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఎఐసిసి సభ్యులు వంశీచంద్ రెడ్డి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జియంఆర్, అనిరుద్ రెడ్డి అదనపు కలెక్టర్ మోహన్ రావుకు వినతి పత్రం ఇచ్చారు. మంత్రి అమిత్ షాను మంత్రిమండలి నుండి బర్తరఫ్ చేయాలని, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.