సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోని కోస్గి ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో SGF(పాఠశాల క్రీడా సమాఖ్య) ఆధ్వర్యంలో 68వ జాతీయస్థాయి అండర్-19 బాలుర వాలీబాల్ పోటీలు గత రెండు రోజులుగా కొనసాగుతున్నాయి. 21 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలు, 7 కేంద్ర పాఠశాలల జట్లతో 400 మంది క్రీడాకారులు, 100 మంది కోచ్లు, మేనేజర్లు హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. ఈనెల 26 వరకు కొనసాగనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa