సినీ ప్రముఖులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో సినీ పరిశ్రమకు సంబంధించి ప్రభుత్వ వైఖరిని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మరోవైపు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో హీరో అల్లు అర్జున్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి బన్నీ ఒక రాత్రి చంచల్ గూడ జైల్లో కూడా గడిపారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్ట్ ను కొందరు సినీ, రాజకీయ ప్రముఖులు తప్పుపట్టారు. తొక్కిసలాటకు అల్లు అర్జున్ బాధ్యుడు కాదని కొందరు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులకు చిక్కడపల్లి పోలీసులు వీడియోలు చూపించినట్టు సమాచారం. సంధ్య థియేటర్ వద్ద ఏం జరిగిందనే వీడియోలను చూపించినట్టు తెలుస్తోంది